చైనా ఓపెన్ సిరీస్ నుంచి నిష్క్రమించిన పీవీ సింధు
- చైనా క్రీడాకారిణి గావో ఫాంగ్జీ చేతిలో ఓటమి
- 21-11, 21-10 తేడాతో ఓటమి పాలైన సింధు
- చైనా ఓపెన్‌లో ముగిసిన భారత పర్వం
గత మూడు వారాల నుంచి డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, నాగ్‌పూర్‌లో జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో ఆడిన సింధు, గావో ఫాంగ్జీతో జరిగిన మ్యాచులో కొంత ఇబ్బందిపడినట్లుగా కనిపించింది. చిన్న చిన్న తప్పులు చేయడం, ప్రత్యర్థిని తికమక పెట్టడంలో సింధు ఇబ్బందులు ఎదుర్కున్నట్లు అనిపించింది.