ys jagan: చిన్నారికి తన తండ్రి పేరును పెట్టిన జగన్... సంబరపడిన తల్లిదండ్రులు!

షార్ట్స్‌లో చూడండి
ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్, ఓ చిన్నారికి నామకరణం చేశారు. దువ్వూరు మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన వరప్రసాద్, వరాలు దంపతులకు బాబు జన్మించగా, ఆ బిడ్డను జగన్ దగ్గరకు తీసుకువచ్చిన వారు, పేరు పెట్టాలని కోరారు. నాన్న పేరు పెడదామని జగన్ సూచించగా, వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆపై జగన్ స్వయంగా బిడ్డకు రాజశేఖర్ అని పేరు పెట్టారు.

తాము అభిమానించే నేత జగన్, స్వయంగా తమ బిడ్డకు పేరు పెట్టడంతో వరప్రసాద్ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా, తన 9వ రోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఆయన్ను పలకరించేందుకు, చేతులు కలిపేందుకు పెద్దఎత్తున వైకాపా అభిమానులు, ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జగన్ కూడా చిరునవ్వుతో వారిని పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు.
Go Back to Shorts
ys jagan
padayatra
kurnool dist

More Telugu News