రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న 'ఛలో'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న 'ఛలో'!

  • 'ఛలో' సినిమా చేస్తోన్న నాగశౌర్య 
  • వేగంగా జరుగుతోన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు
  • కథానాయికగా రష్మిక మందన పరిచయం 
  • డిసెంబర్ 29న విడుదల       
తెలుగు తెరపై దూకుడును కొనసాగిస్తోన్న యువ కథానాయకులలో నాగశౌర్య ఒకరు. లవర్ బాయ్ గా యూత్ లో ఆయనకి మంచి క్రేజ్ వుంది. ఆయన ఖాతాలో మంచి హిట్స్ కూడా వున్నాయి. ఒక వైపున సోలో హీరోగా చేస్తూనే మరో వైపున ఆయన మల్టీ స్టారర్ సినిమాల పట్ల కూడా ఆసక్తిని చూపుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన సొంత బ్యానర్ పై 'ఛలో' అనే సినిమా చేస్తున్నాడు.

వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పార్టీ ను పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమాను, డిసెంబర్ 29వ తేదీన విడుదల చేయనున్నారు. మణిశర్మ తనయుడు సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. త్వరలోనే ఆడియో ఫంక్షన్ ను నిర్వహించనున్నారు. ఈ సినిమాతో నాగశౌర్యకి మరో హిట్ లభించడం ఖాయమనే టాక్ వినిపిస్తూ ఉండగా, రష్మిక మందన కెరియర్ కి ఈ సినిమా ఎంతో హెల్ప్ అవుతుందని అంటున్నారు.   
nagashourya
rashmika

More Telugu News