టాలీవుడ్ యంగ్ హీరో నాని త‌న బుల్లి కుమారుడి ఫొటోను మ‌రోసారి షేర్ చేశాడు. నాని త‌న హృద‌యంపై తన కుమారుడిని ప‌డుకో బెట్టుకుని దిగిన ఫొటోను గ‌తంలో పోస్ట్ చేసి, త‌న కుమారుడి పేరు అర్జున్ అని చెప్పిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో ఆ ఫొటో అభిమానుల‌నే కాకుండా సెల‌బ్రిటీల‌ను కూడా అల‌రించింది. మ‌రోసారి నాని ఈ రోజు త‌న కొడుకుతో క‌లిసి ఫొటో దిగి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ, బాల‌ల దినోత్సవ శుభాకాంక్ష‌ల‌ని ఆయ‌న పేర్కొన్నాడు.

ఈ ఫొటోలో నాని క్యాప్ పెట్టుకుని క‌నప‌డుతున్నాడు. నాని కుమారుడిని ఆయ‌న అభిమానులు 'జూనియ‌ర్ నాని', 'మ‌రో నేచుర‌ల్ స్టార్', 'నాని 2.0' అంటూ కామెంట్లు చేస్తున్నారు.