నా ఇమేజ్ గురించి ఆలోచించకుండా కొన్ని సినిమాలు చేశాను .. నష్టపోయాను : రాజశేఖర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా ఇమేజ్ గురించి ఆలోచించకుండా కొన్ని సినిమాలు చేశాను .. నష్టపోయాను : రాజశేఖర్

  • కొన్ని సందర్భాల్లో ఇమేజ్ గురించి ఆలోచించలేదు 
  • కొత్తదనం కోసం కొన్ని సినిమాలు చేశాను
  • అవి పరాజయం పాలయ్యాయి 
  • ఆర్థికంగా నష్టాలు తెచ్చిపెట్టాయి    
తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో రాజశేఖర్ మాట్లాడుతుండగా ఇమేజ్ ప్రస్తావన వచ్చింది. దానికి ఆయన స్పందిస్తూ " కొన్ని సందర్భాల్లో నేను ఇమేజ్ గురించి ఆలోచించలేదు .. పాత్ర బాగుంది .. సహజంగా వుంది అనిపిస్తే చేసేశాను. ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకునేవాడినే అయితే నేను 'శేషు' అనే సినిమా చేసి ఉండేవాడిని కాదు. తమిళంలో ఆ సినిమా రిలీజ్ కి ముందే కొనేసి తెలుగు రీమేక్ లో చేశాను"

" క్లైమాక్స్ మార్చకపోవడం వలన అది పరాజయం పాలైంది. క్లైమాక్స్ రీ షూట్ చేసి యాడ్ చేద్దామనుకున్నాం .. కానీ కుదరలేదు. క్లైమాక్స్ మార్చి ఉంటే మాత్రం తప్పకుండా అది ఒక మంచి సినిమా అయ్యుండేది. ఇలా నా ఇమేజ్ కి భిన్నమైన 'శేషు' .. 'ఆప్తుడు' .. 'మహంకాళి' .. 'గెడ్డం గ్యాంగ్' సినిమాలు చేయడం వలన డబ్బులు బాగా పోయాయి. అందువల్లనే మా అమ్మా నాన్నలు బాధపడ్డారు" అని చెప్పారు రాజశేఖర్.   
rajasekhar
jeevitha

More Telugu News