అనుష్క పుట్టినరోజున ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన ప్రభాస్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుష్క పుట్టినరోజున ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన ప్రభాస్?

  • ఇటీవలే పుట్టినరోజు వేడుక జరుపుకున్న ప్రభాస్ 
  • ఖరీదైన రిస్ట్ వాచ్ ను కానుకగా ఇచ్చిన అనుష్క 
  • ఈ నెల 7వ తేదీన పుట్టినరోజు వేడుక జరుపుకున్న అనుష్క
ప్రభాస్ .. అనుష్క ప్రేమించుకున్నారనీ .. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు కొన్ని రోజుల క్రితం వరకూ షికారు చేశాయి. అయితే ఇద్దరూ కూడా ఈ విషయాన్ని ఖండించారు. ఈ ప్రచారం పట్ల అనుష్క కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తే, వరుస సినిమాల్లో కలిసి నటిస్తున్నప్పుడు ఇలాంటి ప్రచారాలు జరగడం కామన్ అంటూ ప్రభాస్ తేలికగా తీసిపారేశాడు.

ఇక ఇటీవల ప్రభాస్ బర్త్ డే కి అనుష్క చేసిన ట్వీట్ .. ఆయన పట్ల ఆమెకి గల అభిమానాన్ని చాటి చెప్పింది. "నేను ఎంతగానో ప్రేమించే అద్భుతమైన వ్యక్తి ప్రభాస్ .. సుఖశాంతులతో .. సంపూర్ణ ఆరోగ్యంతో వుండాలని కోరుకుంటున్నాను" అంటూ శుభాకాంక్షలు తెలియజేసింది. అంతే కాకుండా కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఖరీదైన రిస్ట్ వాచ్ లను ఇష్టపడే ప్రభాస్ కి, ఒక రిస్ట్ వాచ్ ను కానుకగా ఇచ్చింది. అలాంటి అనుష్క ఈ నెల 7వ తేదీన పుట్టినరోజు వేడుక జరుపుకుంది. ఆమె బర్త్ డే గిఫ్ట్ గా ప్రభాస్ ఓ 'బీఎం డబ్ల్యూ' కారును గిఫ్ట్ గా ఇచ్చాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.          
prabhas
Anushka Shetty

More Telugu News