నా కోసం అన్నయ్య ఉన్నాడు: కార్తీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా కోసం అన్నయ్య ఉన్నాడు: కార్తీ

  • చిన్నప్పుడు అన్నయ్యతో రోజూ గొడవే
  • పది పూర్తైన తరువాత ఇద్దరం స్నేహితులమయ్యాం
  • నాకోసం అన్ని వేళలా అన్నయ్య ఉన్నాడు
  • నాన్న తరువాత నాన్నలా అన్నయ్య కనిపిస్తాడు
ప్రతి ఇంట్లో అన్నదమ్ములు పెరిగినట్టే తన అన్నయ్యతో తాను కలిసి పెరిగానని సినీ నటుడు కార్తీ తెలిపాడు. చిన్నప్పుడు బాగా గొడవలు పడేవారమని చెప్పాడు. అమ్మానాన్నలు చెప్పినదానికి అన్నయ్య వ్యతిరేకంగా చేస్తే... నేను మాత్రం వాళ్లెలా చెప్పేవారో అలాగే చేసేవాడినని అన్నాడు. స్కూల్ విద్య పూర్తయిన తరువాత తామిద్దరం మంచి స్నేహితులమయ్యామని చెప్పాడు. ఉన్నత విద్యకోసం యూఎస్ వెళ్లిన తరువాత అన్నయ్య విలువ తెలిసిందని అన్నాడు.

తన కెరీర్ మొదట్లో అన్నయ్య ఏ సినిమా చేయమంటే అవే చేసేవాడినని కార్తీ చెప్పాడు. ఇప్పటికీ అన్నయ్య చెబితే మాట్లాడకుండా చేస్తానని అన్నాడు. అప్పట్లో అంటే గొడవపడేవాడినని, ఇప్పుడు అన్నయ్య అంటే చాలా గౌరవమని తెలిపాడు. తన తండ్రి తరువాత ఆయనలా అన్నయ్య కనిపిస్తాడని కార్తీ తెలిపాడు. వదినను చూసి తన భార్య నేర్చుకుంటుందని చెప్పాడు. తన తండ్రి చాలా కష్టపడి తమను పెంచారని, పగలంతా సినిమా షూటింగ్స్ లో పాల్గొని, రాత్రుళ్లు నాటకాలు ఆడేవారని తెలిపాడు. కేవలం నాలుగు గంటలే నిద్రపోయేవారని, అంత కష్టపడి చలనచిత్ర రంగంలో నిలదొక్కుకున్నాడని తెలిపాడు.
karthi
surya
movies

More Telugu News