అన్నయ్యకు .. నాకు అస్సలు పడేది కాదు!: కార్తీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అన్నయ్యకు .. నాకు అస్సలు పడేది కాదు!: కార్తీ

  • అన్నయ్య అభిరుచులు, అభిప్రాయాలు వేరు
  • నా ఆలోచనలు, పద్ధతులు వేరు 
  • అందువలన ఎప్పుడూ గొడవలే 
  • అన్నయ్య విలువ అప్పుడు తెలిసింది      
కోలీవుడ్ లోనేకాదు .. టాలీవుడ్ లోను కార్తీకి మంచి క్రేజ్ వుంది. తన ప్రతి తమిళ సినిమాను తెలుగులోకి డబ్ అయ్యేలా చూస్తూ, ఆ క్రేజ్ ను మరింతగా పెంచుకుంటూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు 'ఖాకీ' రానుంది. ఈ నేపథ్యంలో 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' లో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు.

 ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, "నేను ఒక్క సినిమాల విషయంలోనే అన్నయ్యను ఫాలో అయ్యాను. మా ఇద్దరి అభిరుచులు .. అభిప్రాయాలు వేరు. చిన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రతి విషయంలోను గొడవ జరిగేది. తాను చెప్పింది వినాలనేవాడు .. నేను వినేవాడిని కాదు. ఇక ఏదైనా షేర్ చేసుకునే విషయంలోను తనకి ఎక్కువ .. నాకు తక్కువ. అందువలన ఇద్దరికి ఎంతమాత్రం పడేది కాదు. నేను పై చదువుల కోసం యూఎస్ వెళ్లిన తరువాత నాకు అన్నయ్య విలువ తెలిసొచ్చింది.  అప్పటి నుంచి మా ఇద్దరి మధ్యా అనుబంధం పెరిగింది'' అంటూ కార్తీ చెప్పుకొచ్చాడు.   
karthi

More Telugu News