ఆ సినిమాకు జీవితను వద్దన్నాను!: రాజశేఖర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ సినిమాకు జీవితను వద్దన్నాను!: రాజశేఖర్

  • 'హలో ఎవరు పేసరేది' సినిమాలో జీవితను తొలిసారి కలిశా
  • ఆ సినిమా నుంచి నన్ను తొలగించారు
  • మళ్లీ 'తలంబ్రాలు' సినిమాలో కలుసుకున్నాం
'గరుడ వేగ' సినిమా హిట్ తో రాజశేఖర్ మళ్లీ పునర్వైభవాన్ని సాధించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనను ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా 'అలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన కొన్ని అభిప్రాయాలను, జీవితంలో జరిగిన ఘటనలను అభిమానులతో పంచుకున్నారు.

హౌస్ సర్జన్ కూడా పూర్తి చేసి, సర్జరీలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న సమయంలో తాను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టానని రాజశేఖర్ తెలిపారు. 'హలో యారు పేసరేది' సినిమా సెట్స్ లో తొలిసారి జీవితను కలిశానని చెప్పారు. ఆ సందర్భంగా "డాక్టర్! హీరోయిన్ ఎలా ఉంది?" అంటూ దర్శకుడు, నిర్మాత తనను అడిగారని... 'ఈ పాత్రకు ఆమె సూట్ కాదేమో' అని తాను చెప్పానని... ఆ మరుసటి రోజు తన కోసం కారు రాలేదని... సినిమా నుంచి తనను తొలగించారని తెలిపారు.

ఆ తర్వాత 'తలంబ్రాలు' సినిమాలో మళ్లీ జీవితను కలిశానని... తనను సినిమా నుంచి తొలగించిన విషయాన్ని అప్పుడు ఆమె వద్ద ప్రస్తావించగా... 'హీరో బాగున్నారా లేక మార్చేద్దామా?' అని తనను కూడా అడిగారని... దీనికి సమాధానంగా 'మంచి నటుడు, సినిమాలో పెట్టుకుందాం' అని దర్శకుడికి చెప్పానని జీవిత తనతో చెప్పిందని రాజశేఖర్ అన్నారు. తాను జీవితను వద్దనుకుంటే... ఆమె మాత్రం తాను కావాలని కోరుకుందని గతాన్ని గుర్తు చేసుకున్నారు.
rajasekhar
hero rajasekhar
jeevetha rajasekhar

More Telugu News