పురుషులు కూడా గర్భం దాల్చొచ్చు, పిల్లల్ని కనొచ్చు!
- పురుషుడిలో గర్భాశయాన్ని ప్రవేశపెట్టొచ్చు
- సిజేరియన్ ద్వారా ఆపరేషన్
- పిండం ఎదగడానికి కృత్రిమంగా హర్మోన్లు
టెక్సాస్ లోని శాన్ ఆంటోనియోలో జరిగిన సంఘం వార్షిక సమావేశంలో పాల్సన్ మాట్లాడుతూ, లింగ మార్పిడి అనంతరం పురుషుడిలో గర్భాశయాన్ని ప్రవేశపెట్టడానికి శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అన్నారు. అయితే పురుషులు, స్త్రీల మధ్య పొత్తి కడుపు నిర్మాణం విభిన్నంగా ఉంటుందని... ఈ కారణం వల్ల పురుషుల్లో సాధారణ కాన్పు సాధ్యం కాదని తెలిపారు. సిజేరియన్ ద్వారా కాన్పు చేయాల్సి ఉంటుందని చెప్పారు. గర్భాశయంలో పిండం సక్రమంగా ఎదగడానికి మహిళల్లో ప్రకృతిసిద్ధంగా కొన్ని హార్మోన్లు విడుదల అవుతాయని... ఈ హార్మోన్లను పురుషులకు కృత్రిమంగా ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.