200 కోట్ల వరకూ నష్టపోయాను .. అమ్మకి ఆ బాధ బాగా ఉండేది : హీరో రాజశేఖర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

200 కోట్ల వరకూ నష్టపోయాను .. అమ్మకి ఆ బాధ బాగా ఉండేది : హీరో రాజశేఖర్

  • ప్రీ రిలీజ్ వేడుకలో ఎమోషనల్ అయిన రాజశేఖర్ 
  • రాంగ్ టైమ్ లో రాంగ్ సినిమాలు చేశాను 
  • అందువలన ఆస్తులు అమ్ముకున్నాను
  • విలన్ పాత్రలు చేయడానికి సిద్ధపడ్డాను  
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా 'గరుడవేగ' సినిమా రూపొందింది. వచ్చేనెల 3వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రాజశేఖర్ మాట్లాడుతూ, ఇటీవల చనిపోయిన తన తల్లిని తలచుకుని ఎమోషనల్ అయ్యారు.

"ఈ సినిమా ట్రైలర్ కి 5 మిలియన్ వ్యూస్ వచ్చాయని తెలిసి నాతో పాటు నా తల్లి కూడా సంతోషించింది. కానీ ఆ మరుసటి రోజునే ఆమె చనిపోయారు. రాంగ్ టైమ్ లో రాంగ్ సినిమాలు చేయడం వలన చాలా నష్టపోయాను. 200 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు అమ్ముకున్నాను. దాంతో మా అమ్మ చాలా బాధపడేది. సినిమా వాళ్లలో చాలామంది ఇలా నష్టపోయి చివరి దశలో చేతిలో ఏమీ లేకుండా చేసుకుంటారు. నేను కూడా అలాగే అవుతానేమోనని ఆమె చాలా బాధపడేది" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. "ఆ సమయంలో విలన్ పాత్రలు చేయడానికి సిద్ధపడ్డాను .. కానీ పాత్రలు నచ్చలేదు" అంటూ చెప్పుకొచ్చారు.
rajasekhar

More Telugu News