యుద్ధానికి నిత్యం సిద్ధంగా ఉండండి.. ఆర్మీకి చైనా అధ్యక్షుడి ఆదేశం!
- అధ్యక్షుడిగా రెండోసారి పదవీ కాలాన్ని ప్రారంభించిన జిన్పింగ్
- యుద్ధానికి నిత్యం సన్నద్ధంగా ఉండాలని ఆదేశం
- సంస్కరణల విషయంలో దేశానికే ఆదర్శం కావాలని పిలుపు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మీ ఎప్పుడూ చైనా కమ్యూనిస్టు పార్టీకి విధేయంగా ఉండాలన్నారు. యుద్ధాల్లో గెలవడంపై దృస్టి సారించాలని అన్నారు. సంస్కరణలు, ఆధునికీకరణలో దేశానికి సైన్యం మార్గదర్శిగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా, సైన్యంలోని ముఖ్య అధికారులతో భేటీకి ఇద్దరు జనరల్ స్థాయి అధికారులు హాజరు కాలేదు. అవినీతి ఆరోపణలతో గత నెలలోనే వీరిని విధుల నుంచి పక్కనపెట్టారు. ఈ కారణంగా వీరు అధ్యక్షుడితో భేటీకి హాజరు కాలేదని తెలుస్తోంది.