టాలీవుడ్ హాట్ న్యూస్.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అభయ్ రామ్
Add ap7am to your home Screen

టాలీవుడ్ హాట్ న్యూస్.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అభయ్ రామ్

  • పూజాదికాలు పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా
  • ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పవన్ కల్యాణ్, సెంటరాఫ్ అట్రాక్షన్ అభిరామ్
  • ఈ సినిమాలో అభిరామ్ కోసం ప్రత్యేక పాత్ర
ఫిల్మ్ నగర్ లో టాలీవుడ్ హాట్ న్యూస్ ఒకటి హల్ చల్ చేస్తోంది. పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయగా... జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా పూజాదికాలు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభిరామ్ నిలిచాడు.

ఇక తాజా సమాచారం ప్రకారం, అభిరామ్ ను ఈ సినిమాలో నటింపజేయనున్నట్టు తెలుస్తోంది. తారక్ సినిమా షూటింగ్స్ లో సందడి చేసే అభిరామ్ ప్రత్యేక పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై జూనియర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, ఈమధ్యే విడుదలైన 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ కుమారుడు మహాధన్ వెండితెరకు పరిచయమై మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. 
jr ntr
trivikram
abhiram

More Telugu News