ట్విట్టర్ ట్రెండింగ్స్: పవన్ కల్యాణ్ తరువాత ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్
- ట్విట్టర్ ట్రెండింగ్స్ లో పవర్ స్టార్, యంగ్ రెబల్ స్టార్, సూపర్ స్టార్, యంగ్ టైగర్
- హ్యాష్ ట్యాగ్స్ తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్న అభిమానులు
- అగ్రస్థానంలో పవన్ కల్యాణ్, తరువాత ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్
ఈ నేపథ్యంలో #HBDLEADERPAWANKALYAN అనే హ్యాష్ ట్యాగ్, #HBDDARLINGPRABHAS హ్యాష్ ట్యాగ్, #HBDMAHESHBABU హ్యాష్ ట్యాగ్, #HAPPYBIRTHDAYNTR హ్యాష్ ట్యాగ్ లతో అభిమానులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పనారంభించారు. వీటిని లెక్కించే ఒక సంస్థ పలు గణాంకాలను వివరిస్తూ, టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ 2.9 మిలియన్ల ట్వీట్లతో అగ్రస్థానంలో నిలిచాడని తెలిపింది. రెండో స్థానంలో 2.1 మిలియిన్ల శుభాకాంక్షల ట్వీట్స్ తో ప్రభాస్ నిలిచాడని తెలిపింది. 1.1 మిలియన్ విషెస్ ట్వీట్స్ తో మహేష్ బాబు మూడోస్థానంలో నిలవగా, 7 లక్షల ట్వీట్స్ తో జూనియర్ ఎన్టీఆర్ నాలుగో స్థానంలో నిలిచాడని సదరు సంస్థ వెల్లడించింది.