ప్ర‌భాస్ పుట్టిన రోజుకి అనుష్క స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్ర‌భాస్ పుట్టిన రోజుకి అనుష్క స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌!

  • డిజైన‌ర్ వాచీని బ‌హుమ‌తిగా ఇచ్చిన బొమ్మాళీ
  • ఆశ్చ‌ర్యానికి గురైన యంగ్ రెబల్ స్టార్‌
  • వాచీలంటే ప్ర‌భాస్‌కి ప్రాణం
పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్ర‌భాస్‌కి సినీ ప్ర‌ముఖులు విషెస్ తెలిపిన సంగ‌తి తెలిసిందే. కానీ త‌న బెస్ట్‌ఫ్రెండ్ అనుష్క మాత్రం అత‌నికి ఒక స‌ర్‌ప్రైజ్ బ‌హుమ‌తి ఇచ్చిన‌ట్లు స‌మాచారం. డిజైన‌ర్ వాచీలంటే అమితంగా ఇష్ట‌ప‌డే ప్ర‌భాస్‌కి ఓ మంచి డిజైన‌ర్ వాచీని గిఫ్ట్‌గా ఇచ్చిన‌ట్లు మీడియా వెల్ల‌డించింది. ఆ వాచీ చూసి ప్ర‌భాస్ ఆశ్చ‌ర్యానికి గురైన‌ట్లు పేర్కొంది.

ఇటీవ‌ల వీళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నార‌ని, త్వ‌ర‌లో నిశ్చితార్థం కూడా జ‌రుపుకోనున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తామిద్ద‌రూ మంచి స్నేహితుల‌మ‌ని, నిశ్చితార్థం, పెళ్లి లాంటి విష‌యాల ప్ర‌స‌క్తే తమ మ‌ధ్య లేద‌ని ప్ర‌భాస్ స్ప‌ష్ట‌త‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే.
prabhas
anushka
young rebel star
birthday
surprise gift

More Telugu News