హైదరాబాద్ హెరిటేజ్ సూపర్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం
- షార్ట్ సర్క్యూట్ తో మంటలు
- భారీగా ఆస్తి నష్టం
- మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ ఇంజన్లు
కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. హెరిటేజ్ మార్కెట్లో ఉన్న ఆహార, నిత్యావసర ప్రొడక్టులన్నీ తగులబడి పోయినట్టు తెలుస్తోంది. స్టోర్ ఉన్నతోద్యోగులు వచ్చిన తరువాతనే ఎంత నష్టం సంభవించిందన్న విషయం తెలుస్తుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.