అనుష్క కోసం అదనంగా 5 కోట్లు పెట్టేస్తున్నారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుష్క కోసం అదనంగా 5 కోట్లు పెట్టేస్తున్నారట!

  • 'భాగమతి' షూటింగ్ పూర్తి  
  • దర్శకుడిగా 'పిల్ల జమీందార్' అశోక్ 
  • బరువు తగ్గని అనుష్క 
  • నాజూకుగా చూపించడానికి గ్రాఫిక్స్ సాయం  
తెలుగు .. తమిళ భాషల్లో అనుష్కకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుతం ఆమె తెలుగులో 'భాగమతి' మినహా మరో సినిమా చేయడం లేదు. దానికి కారణం, ఆమె బరువు బాగా పెరగడమేనని అంటున్నారు. 'భాగమతి' షూటింగు సమయంలో కూడా ఆమె అధిక బరువుతోనే వుందట.

దాంతో ఆమెను కొంత నాజూకుగా చూపించడానికి గ్రాఫిక్స్ సాయాన్ని తీసుకుంటున్నారని అంటున్నారు. ఇందుకోసం అదనంగా మరో 5 కోట్లను ఖర్చు చేస్తున్నట్టుగా సమాచారం. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓ 'అరుంధతి' .. ఓ 'రుద్రమదేవి' మాదిరిగా 'భాగమతి' కూడా అనుష్కకి మంచి పేరు తీసుకువస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. 
anushka

More Telugu News