సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేశ్ బాబు ఫ్యామిలీ ఫోటో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేశ్ బాబు ఫ్యామిలీ ఫోటో

  • ఆమధ్య స్పైడర్ వేడుకలో సందడి చేసిన మహేశ్ బాబు ఫ్యామిలీ
  • నలుగురూ నిల్చున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన నమ్రతా శిరోద్కర్
  • ఒకే స్టైల్ లో నిల్చున్న మహేశ్, సితార, గౌతమ్, నమ్రత
సోషల్ మీడియాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఇటీవల విడుదలైన స్పైడర్ ఆడియో వేడుకలో మహేశ్ బాబు ఫ్యామిలీ మొత్తం వేదికపై సందడి చేసింది. ఈ సందర్భంగా వారంతా నిలబడి ఉన్న స్టైల్ ఫొటోలను మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ గా మారింది. ఈ ఫొటోలో మహేశ్, సితార, గౌతమ్, నమ్రత నలుగురూ ఒకే పోజులో నిల్చుని ఉండడం విశేషం. దీనికి 'స్పీచ్ లెస్' అంటూ నమ్రత క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటోను చూసిన అభిమానులంతా 'వావ్ .. స్టయిలే స్టయిలు' అంటూ కితాబునిస్తున్నారు.


mahesh babu
namrata
sitara
goutam

More Telugu News