వీరిద్దరూ డెంగ్యూ దోమలకన్నా ద్రోహులు: డీఎంకే పత్రిక మురసోలి

  • పళనిస్వామి, పన్నీర్ లు ద్రోహులు
  • తమిళనాడులో ప్రబలిన డెంగ్యూ
  • విమర్శలు గుప్పించుకుంటున్న అన్నాడీఎంకే, డీఎంకే
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలపై డీఎంకే అధికార పత్రిక మురసోలి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజల రక్తం తాగడంలో వీరిద్దరూ డెంగ్యూ దోమలను మించిపోయారని... వీరిద్దరూ ద్రోహులని విమర్శించింది. ఈ మేరకు ఓ కార్టూన్ ను ప్రచురించింది. తమిళనాడులో డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ప్రబలింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే, డీఎంకేలు ఈ అంశంపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. డీఎంకే పార్టీ డెంగ్యూ వ్యాధిలాంటిదని, ఆ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటూ మంత్రి సెల్లు రాజా విమర్శించారు. మరోవైపు ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ ను 'డెంగ్యూ భాస్కర్'గా డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అభివర్ణించారు.
Go Back to Shorts
palani swamy
stallion
dmk
aiadmk
panneer selvam

More Telugu News