‘రాహుల్ బాబా’ అంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడిపై అమిత్ షా చురకలు

10-10-2017 Tue 18:01 | National
  • ఉత్త‌ర ప్ర‌దేశ్‌, అమేథీలో బీజేపీ భారీ బహిరంగ సభ
  • కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా విమర్శలు 
  • మూడు తరాలుగా అమేథీ ప్ర‌జ‌లు నెహ్రూ కుటుంబ నేత‌ల‌కు ఓట్లు వేస్తున్నారు
  • ఆ పార్టీ నేత‌లు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదు
ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీని బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా ‘రాహుల్ బాబా’గా అభివర్ణించారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌ ప‌ర్య‌టన‌లో ఉన్న అమిత్ షా.. ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నియోజ‌క‌వ‌ర్గం అమేథీలో ఈ రోజు ఏర్పాటు చేసిన‌ భారీ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ.. కొన్ని ద‌శాబ్దాలుగా అమేథీ ప్ర‌జ‌లు నెహ్రూ కుటుంబ నేత‌ల‌కు ఓట్లు వేస్తున్నార‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ ఆ పార్టీ నేత‌లు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేద‌ని ఆరోపించారు.

అమేథీలో ఇప్ప‌టికీ కలెక్ట‌ర్ ఆఫీస్ లేద‌ని, క్ష‌య రోగులకు వైద్యం చేయ‌డానికి ఆసుప‌త్రి లేద‌ని, ఇక్క‌డి యువ‌త‌కు ఉద్యోగాలు లేవ‌ని అమిత్ షా అన్నారు. ‘నేను రాహుల్ బాబాను అడుగుతున్నాను. నెహ్రూ కుటుంబ నేత‌ల‌కు మూడు త‌రాల నుంచి ఇక్క‌డి ప్ర‌జ‌లు ఓట్లు వేస్తున్నారు. వారిపై కృత‌జ్ఞ‌త చూపించే విధానం ఇదేనా?’ అని ప్ర‌శ్నించారు. 70 ఏళ్లుగా ఆ కుటుంబంపైనే న‌మ్మ‌కంతో ఉన్న‌ ప్ర‌జ‌లు ఇక‌పై మోదీ,  బీజేపీపై న‌మ్మ‌కం పెట్టుకోవాల‌ని, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకే ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు.

గ‌త ఎన్నిక‌ల్లో అమేథీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన‌ప్ప‌టికీ స్మృతి ఇరానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు ప‌డుతున్నార‌ని అమిత్ షా వ్యాఖ్యానించారు. అమేథీ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ.. ఈ ప్రాంతాన్ని ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశాడ‌ని, ఇంత‌టి నిర్ల‌క్ష్య‌పు ఎంపీని తాను ఎక్క‌డా చూడ‌లేద‌ని అన్నారు. ‘2014లో కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మోదీ ప్ర‌భుత్వం మొత్తం 106 ప‌థ‌కాల‌ను ప్రారంభించింది. రాహుల్ బాబాకి 106 అంకెలు కూడా స‌రిగ్గా లెక్క‌పెట్ట‌డం రాదు’ అంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు.  
అమిత్ షా

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more