ఫ్లాప్ టాక్ వచ్చినా... రూ. 150 కోట్లు కొల్లగొట్టిన 'స్పైడర్': అధికారికంగా ప్రకటించిన నిర్మాత ఠాగూర్ మధు
- 11 రోజుల్లోనే రూ. 150 కోట్ల గ్రాస్
- 12వ రోజు పోస్టర్ లో ప్రకటన
- అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిన నిర్మాత
ఇంత భారీ కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన ప్రేక్షకులకు, మహేష్ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు నిర్మాత ఠాగూర్ మధు వెల్లడించారు. 'బాహుబలి' తరువాత విదేశాల్లో అత్యధిక సెంటర్లలో 'స్పైడర్' విడుదలైన సంగతి తెలిసిందే. 11 రోజుల్లోనే ఈ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్ సీస్ లో 16 మిలియన్ డాలర్ల కలెక్షన్ కు చిత్రం చేరుతుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నేడు ఆదివారం కలెక్షన్లు కూడా సంతృప్తికరంగా ఉంటాయని భావిస్తున్నారు.