ఆ మాట చెప్పగానే మా నాన్న 'పండగ చేస్కో' అన్నారు: హీరోయిన్ అనుష్క
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ మాట చెప్పగానే మా నాన్న 'పండగ చేస్కో' అన్నారు: హీరోయిన్ అనుష్క

  • అనుష్క అసలు పేరు స్వీటీ
  • సినిమాల్లోకి వచ్చాకే పేరు మార్చుకోవాలన్న ఆలోచన
  • తండ్రికి చెబితే, నీ పేరు నువ్వే పెట్టుకో అన్నారట
  • ఓ ఇంటర్వ్యూలో అనుష్క
అందాల నటి అనుష్క అసలు పేరు స్వీటీ అన్న సంగతి తెలిసిందే. చిన్నతనంలో ముద్దుగా అమ్మానాన్నలు పెట్టుకున్న స్వీటీ అన్న పేరే, ఆమె స్కూలు రికార్డుల్లో ఉండిపోగా, తన పేరు అనుష్కగా ఎలా మారిందన్న విషయమై ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పింది. తనకు స్వీటీ అని పిన్నమ్మ పేరు పెట్టిందని, తల్లిదండ్రులు సాయి భక్తులు కావడంతో సాయి అన్న పేరు కలిసొచ్చేలా మరో పేరు పెట్టాలని వారు అనుకున్నా, అది వాయిదా పడుతూ వచ్చిందని చెప్పింది. ఆపై స్కూల్లో కూడా స్వీటీ అనే పేరునే రాసి చేర్పించారని, అదే నాపేరని చెబితే, అందరూ నవ్వుతూ ఉండేవాళ్లని, దీంతో చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది.

ఇక్ సినిమాల్లోకి వచ్చిన తరువాత, 'సూపర్' షూటింగ్ సెట్లో స్వీటీ... స్వీటీ అని సెట్లో పిలుస్తుంటే బాగాలేదని నాగార్జున, సోనూసూద్ లతో డిస్కస్ చేశానని, వారు పేరు మార్చుకోవాలని సూచించారని గుర్తు చేసుకుంది. ఇక తక్షణమే తండ్రికి ఫోన్ చేసి పేరు మార్చుకోవాలన్న కోరికను చెప్పి, మంచి పేరును సూచించమని చెప్పగా, "ఎవరికీ జీవితంలో తన పేరును తాను పెట్టే అవకాశం దక్కదు. నీకా అవకాశం వచ్చింది పండగ చేస్కో. నీ పేరు నువ్వే పెట్టుకో" అని చెప్పేశారని, ఆపై ఎన్నో వెబ్ సైట్లు, పిల్లల పుస్తకాల పేర్లు వెతికి, మూడు నెలల పాటు శ్రమించి అనుష్క అన్న పేరును కనిపెట్టి, సన్నిహితులకు కొత్త పేరు గురించిన సమాచారాన్ని ఇచ్చానని అనుష్క ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇక పేరు మార్చుకున్న తరువాత దానికి అలవాటు పడేందుకు తనకు ఏడాదికి పైగానే సమయం పట్టిందని చెప్పింది.
anushka
sweety
super
nagarjuna

More Telugu News