రియ‌ల్ ఫాద‌ర్‌, రీల్ ఫాద‌ర్‌ల‌తో ధోనీ.... ట్విట్ట‌ర్‌లో ఫొటో షేర్ చేసిన అనుప‌మ్ ఖేర్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రియ‌ల్ ఫాద‌ర్‌, రీల్ ఫాద‌ర్‌ల‌తో ధోనీ.... ట్విట్ట‌ర్‌లో ఫొటో షేర్ చేసిన అనుప‌మ్ ఖేర్‌

  • ధోనీ ఆతిథ్యాన్ని మెచ్చుకున్న న‌టుడు
  • సాక్షి, ధోనీల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ట్వీట్‌
  • వారి కూతుర్ని పొగుడుతూ మరో ట్వీట్
ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్ గెల్చిన త‌ర్వాత భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లంద‌రూ త‌మకు న‌చ్చిన విధంగా సేద‌తీరుతున్నారు. ధోనీ కూడా త‌న కుటుంబంతో స‌మ‌యం గ‌డ‌పడానికి రాంచీ వ‌చ్చేశాడు. అంతేకాకుండా రాంచీలో షూటింగ్ కోసం వ‌చ్చిన ప్ర‌ముఖ న‌టుడు అనుప‌మ్ ఖేర్‌ను త‌న ఇంటికి ఆహ్వానించాడు. ఈ సంద‌ర్భంగా త‌న నిజ‌జీవిత‌ తండ్రి న‌రేంద్ర సింగ్ ధోనీ, సినీజీవిత తండ్రి అనుప‌మ్ ఖేర్‌ల‌తో క‌లిసి ధోనీ ఫొటో దిగాడు.

ధోనీ జీవిత క‌థ ఆధారంగా వ‌చ్చిన `ఎంఎస్ ధోనీ` చిత్రంలో అనుప‌మ్ ఖేర్ ధోనీ తండ్రిగా న‌టించారు. ఆ ఫొటోను అనుప‌మ్ ఖేర్ త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. `ధోనీ, సాక్షి.... మీ ఆతిథ్యం చాలా బాగుంది. మీ కొత్త ఇల్లు నాకు బాగా న‌చ్చింది` అంటూ ఆయ‌న పోస్ట్ చేశారు. అంతేకాదు... ధోనీ, సాక్షిల గారాల ప‌ట్టి జీవ గురించి కూడా ఆయ‌న ట్వీట్ చేశాడు. `జీవ చాలా తెలివైంది. బాగా పాడుతుంది. జాతీయ గీతాన్ని చాలా గ‌ట్టిగా పాడింది` అంటూ అనుప‌మ్ పోస్ట్ చేశాడు.
real father
reel father
anupam kher
dhoni
sakshi
ziva

More Telugu News