ప్రభాస్ కు ఇలాంటి అమ్మాయిలు నచ్చేవారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ కు ఇలాంటి అమ్మాయిలు నచ్చేవారట!

  • చిన్నప్పుడు ఊర్లోని అమ్మాయిలంటే ఇష్టం
  • ఆ తర్వాత పొడవైన కురులుండే అమ్మాయిలపై ఇష్టం కలిగింది
  • ఇప్పుడైతే బుద్ధిమంతురాలు, పొడగరి కావాలనిపిస్తోంది
  • నా ఫస్ట్ క్రష్ మా టీచర్ పైనే
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్. వరుసగా హిట్లు కొడుతున్న ప్రభాస్... పెళ్లికి మాత్రం ఇంకా దూరంగానే ఉన్నాడు. ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ... పెళ్లికూతురు ఫొటో కూడా ఆ మధ్యలో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. 'బాహుబలి 2' సినిమా అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ ఆ మధ్యలో ప్రభాస్ ఒకసారి చెప్పాడు. ఆ సినిమా అయిపోయింది... ఇప్పుడు 'సాహో' అంటూ మళ్లీ బిజీ అయిపోయాడు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటానని తెలిపాడు.

ఇదే సమయంలో తనకు చిన్నప్పుడు నచ్చిన అమ్మాయిల గురించి పలు విషయాలను ప్రభాస్ చెప్పాడు. చిన్నప్పుడు తమ గ్రామంలో ఉన్న అమ్మాయిలంటే ఇష్టం ఉండేదని తెలిపాడు. కొంచెం పెద్దయ్యాక పొడవైన కురులు ఉన్న అమ్మాయిలంటే ఇష్టం కలిగేదని చెప్పాడు. ప్రస్తుతానికైతే బుద్ధిమంతురాలు, పొడవైన అమ్మాయి అయితే బాగుంటుందని అనిపిస్తోందని అన్నాడు. తన నిర్ణయాలు తరచుగా మారిపోతుంటాయని చెప్పాడు. సినిమాలో చూపించినట్టు నిజ జీవితంలో ఫాంటసీలు ఉండవని అన్నాడు. ఇదే ఇంటర్వ్యూలో ప్రభాస్ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ప్రభాస్ తొలి క్రష్ స్కూల్ టీచర్ మీద కలిగిందట. ఆమెను చూడగానే చదవడం కూడా మర్చిపోయేవాడట. 
prabhas
prabhas marriage
prabhas first crush
tollywood

More Telugu News