చంద్రబాబు వెళ్లిన అరగంటకు వెంకటాపురం చేరుకున్న కేసీఆర్
- నూతన వధూవరులను ఆశీర్వదించిన కేసీఆర్
- కేరింతలు కొట్టిన పరిటాల అభిమానులు
- పలువురితో మాటలు కలిపిన కేసీఆర్
- మధ్యాహ్నం తరువాత తిరిగి హైదరాబాద్ కు కేసీఆర్
కేసీఆర్ ను చూడగానే, అక్కడున్న పరిటాల అభిమానులు పెద్దఎత్తున కేరింతలు కొట్టారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన కేసీఆర్, వారికి శుభాభినందనలు తెలిపి, అక్కడే కూర్చుని పలువురు ప్రముఖులతో మాటలు కలిపారు. కేసీఆర్ రాక సందర్భంగా వెంకటాపురంలో ఏపీ పోలీసులతో పాటు, తెలంగాణ నుంచి ప్రత్యేకంగా వచ్చిన పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం తరువాత ఆయన తిరిగి పుట్టపర్తికి హెలికాప్టర్ లో వెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు.