పాటలకు చెత్తగా అభినయిస్తూ, సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మలేషియా మహిళ.. వీడియో చూడండి
- మరో డించక్ పూజ అంటున్న నెటిజన్లు
- పాటలను హావభావాలతో ఖూనీ చేస్తున్న యూట్యూబ్ స్టార్
- వేల సంఖ్యలో వీక్షణలు
కారులో ప్రయాణిస్తూ ఆమె పాటలను అభినయిస్తుండగా, పక్కనే కూర్చున్న డ్రైవర్ ముఖంలో ఎలాంటి హావభావాలు పలికించకపోవడం ఇంకా నవ్వు తెప్పిస్తుంది. ఇప్పటికే మలేషియా వ్యాప్తంగా మీరా జేమ్స్ ఓ సెలబ్రిటీగా మారింది. పాటలను కర్ణకఠోరంగా పాడి సెలబ్రిటీగా మారిన డించక్ పూజతో ఈమెను పోలుస్తున్నారు నెటిజన్లు. బాలీవుడ్ పాటలతో పాటు కొన్ని ప్రముఖ ఇంగ్లిషు, తమిళ, తెలుగు పాటలను కూడా మీరా జేమ్స్ వదిలిపెట్టలేదు. ఒక్కసారి ఆమె వీడియోలు చూస్తే నవ్వాపుకోలేరు. అందుకే ఈమె వీడియోలకు వీక్షణలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి.