'స్పైడర్' సినిమాపై మహేష్ బాబు సోదరి మంజుల స్పందన
- మహేష్ నటన అద్భుతం
- సాంగ్స్ స్టైలిష్ గా ఉన్నాయి
- అంతర్జాతీయ స్థాయి చిత్రం
మరోవైపు మహేష్ బాబు సోదరి మంజుల ఈ సినిమాను తొలిరోజే చూశారు. అనంతరం ఆమె తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమా మేకింగ్ చాలా బాగుందని చెప్పిన మంజుల... మహేష్ నటన అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. సాంగ్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉందని అన్నారు.