చైనాలో 'బాహుబలి 2' రిలీజ్ కి రంగం సిద్ధం .. హాలీవుడ్ చిత్రాల పోటీని తట్టుకోగలదా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైనాలో 'బాహుబలి 2' రిలీజ్ కి రంగం సిద్ధం .. హాలీవుడ్ చిత్రాల పోటీని తట్టుకోగలదా?

  •  చైనాలో 'బాహుబలి 2' రిలీజ్ కి సన్నాహాలు
  •  డిసెంబర్లో అక్కడ భారీస్థాయి రిలీజ్
  •  అదే సమయంలో రంగంలోకి హాలీవుడ్ మూవీస్
  •  'బాహుబలి 2'కి దక్కే ఆదరణపై ఆసక్తి  
వివిధ దేశాల్లో విజయవిహారం చేసిన 'బాహుబలి 2'ను చైనాలో రిలీజ్ చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అక్కడ భారీస్థాయిలో విడుదల కావలసింది. కానీ సమయానికి 'దంగల్' వచ్చేసి 'బాహుబలి 2'కి అడ్డుపడింది. ఆ సినిమా దూసుకుపోతోన్న తీరు చూసి, 'బాహుబలి 2' వెనక్కి తగ్గవలసి వచ్చింది.

 ఇక డిసెంబర్ లో చైనాలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగా ప్రమోషన్ కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారు. అయితే డిసెంబర్లో చైనాలో భారీ స్థాయిలో హాలీవుడ్ సినిమాలు విడుదల కానున్నాయి. మొదటి నుంచి కూడా చైనాలో హాలీవుడ్ మూవీస్ కి క్రేజ్ ఎక్కువ. అందువలన 'బాహుబలి 2'కి ఆ సినిమాలు గట్టిపోటీ ఇవ్వనున్నాయి. హాలీవుడ్ సినిమాల పోటీని తట్టుకుని 'బాహుబలి 2' నిలుస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
prabhas
anushka

More Telugu News