ఆ 'స్పైడర్' సినిమాలో కనిపించదు: నిరాశ పరిచిన మహేష్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ 'స్పైడర్' సినిమాలో కనిపించదు: నిరాశ పరిచిన మహేష్ బాబు

  • టీజర్ లో చూపిన 'స్పైడర్' సినిమాలో ఉండదు
  • కాన్సెప్ట్ ను చూపేందుకే టీజర్ అలా తీశాము
  • నేనేమీ డబుల్ యాక్షన్ చేయలేదు: ప్రిన్స్
'స్పైడర్' రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న మహేష్ బాబు నూతన చిత్రం. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టీజర్ మీకు గుర్తుందా? మహేష్ బాబు సీరియస్ గా తన పని చేసుకుంటూ వెళుతుంటే, ఓ రోబో స్పైడర్ మెల్లగా ఆయన కాలు పట్టుకుని పైకి ఎక్కి, భుజంపై చేరి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మహేష్ దాన్ని 'ష్...' అని హెచ్చరిస్తే, తోక ముడుచుకుని కూర్చుంటుంది.

అయితే, సినిమాలో ఈ 'స్పైడర్' కనిపించదట. ఈ విషయాన్ని మహేష్ బాబే స్వయంగా చెప్పి, అభిమానులకు కొంత నిరాశ కలిగించాడు. సినిమా కాన్సెప్ట్ ను చూపించేందుకే ఆ టీజర్ ను షూట్ చేశామని చెప్పాడు. చిత్రంలో తాను ఐబీ అధికారిగా పనిచేశానని చెప్పాడు. ఈ చిత్రంలో తాను డబుల్ యాక్షన్ చేశానని వచ్చిన వార్తలు అవాస్తవమని, అటువంటిది ఉంటే ట్రయిలర్ లో చూపించే వాళ్లమని చెప్పాడు.

'స్పైడర్'లో నటించడం తనకెంతో కొత్త అనుభవాన్ని ఇచ్చిందని, వేర్వేరు నటులతో తెలుగు, తమిళ భాషల్లో చిత్రం ఒకేసారి చిత్రీకరించడం వల్ల, తాను గంటల వ్యవధిలో తెలుగు, తమిళం మాట్లాడుతూ ఉండాల్సి వచ్చేదని చెప్పాడు. ఇక ఆ చిత్రం షూటింగ్ తరువాత ప్రస్తుతం నటిస్తున్న 'భరత్ అను నేను'లో చాలా సులభంగా నటించేస్తున్నానని చెప్పుకొచ్చాడు.
mahesh babu
spyder
murugadas

More Telugu News