రాజమౌళితో నా సినిమా తప్పకుండా ఉంటుంది : మహేశ్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమౌళితో నా సినిమా తప్పకుండా ఉంటుంది : మహేశ్ బాబు

  • మురుగదాస్ తో ద్విభాషా చిత్రం చేయడం అదృష్టం
  •  ఆయన పనితీరు ఆశ్చర్యపరిచింది
  •  రాజమౌళితో నా సినిమా ఉంటుందనేది నిజమే
  •  ప్రస్తుతం కమిటైన ప్రాజెక్టులు పూర్తికాగానే,ఆ సినిమా ఉంటుంది  
మహేశ్ బాబు అభిమానుల నిరీక్షణకు తెరదించేస్తూ రేపే 'స్పైడర్' థియేటర్స్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో మహేశ్ బాబు మాట్లాడాడు. 'స్పైడర్' సినిమాను మురుగదాస్ అద్భుతంగా తెరకెక్కించారని మహేశ్ బాబు చెప్పాడు. ఆయన దర్శకత్వంలో తన ద్విభాషా చిత్రం రావడం ఆనందంగా ఉందని అన్నాడు.

రాజమౌళితో సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి .. నిజమేనా? అనే ప్రశ్న ఈ సందర్భంలోనే ఆయనకి ఎదురైంది. రాజమౌళి .. తాను కలిసి ఒక సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చామని మహేశ్ బాబు చెప్పాడు. ప్రస్తుతం ఆయన కమిట్ మెంట్స్ ఆయనకి ఉన్నాయనీ, అలాగే తన కమిట్ మెంట్స్ తనకి ఉన్నాయని అన్నాడు. ఆ ప్రాజెక్టులు పూర్తి కాగానే తమ కాంబినేషన్లో సినిమా తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశాడు. మహేశ్ అభిమానులకు ఇంతకి మించిన శుభవార్త ఉండదేమో!   
mahesh babu

More Telugu News