రూ. 3.5 లక్షలు పలికిన అడాల్ఫ్ హిట్లర్ ధరించిన నిక్కరు!
1938లో ఆస్ట్రియాలోని పార్క్హోటల్ గ్రాజ్ హోటల్లో బస చేసినపుడు హిట్లర్ ఈ నిక్కరును అక్కడ వదిలేసినట్లు వేలం నిర్వహించిన సంస్థ తెలిపింది. ఆ హోటల్ యజమానుల వంశానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర్నుంచి ఈ నిక్కరును వేలం నిర్వహణ సంస్థ సొంతం చేసుకుంది. ఈ నిక్కరుతో పాటు హిట్లర్ బస చేసిన హోటల్ గదిలో మరికొన్ని చిన్న చిన్న వస్తువులను కూడా వదిలేసినట్లు తెలుస్తోంది.