మా అమ్మతో పాటు భార్య కూడా అలానే తయారైంది: ప్రణతిపై ఎన్టీఆర్
- నవరత్న హెయిర్ ఆయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఎన్టీఆర్
- నేను తెరపై కనిపిస్తుంటే మా అమ్మ మరెవరినీ చూడదు
- ఈ మధ్య ప్రణతి కూడా అలానే తయారైందని చెప్పి నవ్వులు పూయించిన ఎన్టీఆర్
- బిగ్ బాస్-2పై మాట్లాడే సమయం కాదంటూ దాటవేత
సమాధానం ఇచ్చిన ఎన్టీఆర్, నేను తెరపై కనిపిస్తుంటే, మా అమ్మ చూపు నన్ను దాటి ఎక్కడికీ వెళ్లదు. నా భార్య ప్రణతి కూడా ఇలాగే తయారైంది. నన్ను తప్ప ఎవరినీ చూడదు అని చెప్పి నవ్వులు పూయించాడు. ఈ ఇద్దరు మహిళలూ తన జీవితంలో ఉండటం తనకెంతో అదృష్టమని అన్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 2లోనూ హోస్ట్ గా మీరే ఉంటారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు దానికి సమాధానం చెప్పే సమయం, సందర్భం ఇది కాదంటూ దాటవేశాడు.