సక్సెస్ సంబరాలకు రెడీ అవుతోన్న ఎన్టీఆర్ టీమ్!
- కొనసాగుతోన్న 'జై లవ కుశ' జోరు
- తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వసూళ్లు
- ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల షేర్
- సక్సెస్ సంబరాలకు ఏర్పాట్లు
ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ సంబరాలు జరుపుకోవడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. వీలైనంత వరకూ ఈ రోజు సాయంత్రమే ఈ సక్సెస్ సంబరాలు వుంటాయని అంటున్నారు. కథానాయకుడిగా ఎన్టీఆర్ కి హ్యాట్రిక్ హిట్ ను ఇచ్చిన సినిమా కావడం, నిర్మాతగా కల్యాణ్ రామ్ కి దక్కిన భారీ సక్సెస్ కావడంతో, ఈ సంబరాలను గ్రాండ్ గా జరపనున్నారని చెబుతున్నారు. ఈ సక్సెస్ పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీగా వున్నారు.