బిగ్ బాస్ షో ముగియడంతో తీవ్ర భావోద్వేగానికి గురైన జూనియర్ ఎన్టీఆర్
- ఎన్టీఆర్ పై 'ఏవీ' ప్రదర్శించిన బిగ్ బాస్
- భావోద్వేగానికి గురైన జూనియర్ ఎన్టీఆర్
- మరి కాసేపు 'ఏవీ' కొనసాగితే ఏడ్చేవాడినన్న ఎన్టీఆర్
- బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ఎప్పుడైనా నన్ను కలవొచ్చు
- బయట తప్పకుండా కలుద్దాం
వాటిని చూసిన జూనియర్ ఎన్టీఆర్...ఈ ఏవీ మరికొంచెంసేపు కొనసాగితే ఏడ్చేసేవాడినని అన్నాడు. ఆ సందర్భంగా బిగ్ బాస్ ను వేదికమీదకి రమ్మని పిలిచాడు. బిగ్ బాస్ స్పందించకపోవడంతో...తాను ఆడియన్స్ కి మాట ఇచ్చేశానని, బిగ్ బాస్ రావాల్సిందేనని జూనియర్ మళ్లీ పిలిచాడు. అయితే బిగ్ బాస్ 'కళ్లు, గొంతు తానైతే, రూపం మాత్రం జూనియర్ ఎన్టీఆర్' అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, కంటెస్టెంట్స్ తో తనది మరపురాని అనుబంధమని, వారు ఏ క్షణంలో వచ్చి తనను కలిసినా ఆనందిస్తానని చెప్పాడు. అందరం బయట కలుద్దామని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు.