ఏడు రోజులుగా నిద్ర లేదు... హార్ట్ బీట్ 10 రెట్లు పెరిగింది: మహేష్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏడు రోజులుగా నిద్ర లేదు... హార్ట్ బీట్ 10 రెట్లు పెరిగింది: మహేష్ బాబు

  • 27న విడుదలకు సిద్ధమైన స్పైడర్
  • మంచి సినిమా తీశామన్న మహేష్ బాబు
  • నిర్మాతల సహకారంతోనే ఇంత భారీ ప్రాజెక్టు
మరో రెండు రోజుల్లో తాను నటించిన 'స్పైడర్' విడుదల కానున్న నేపథ్యంలో తమిళ వర్షన్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ బాబు, మీడియాతో మాట్లాడాడు. తనకు వారం రోజులుగా నిద్ర రావడం లేదని చెప్పిన ఆయన, గుండె కొట్టుకునే వేగం 10 రెట్లు ఎక్కువైనట్టు అనిపిస్తోందని అన్నాడు. ఓ మంచి సినిమా తీశామని, ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం తనకుందని చెప్పాడు. తన కెరీర్ లోని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఇదొకటని, మురుగదాస్ దర్శకత్వంలో నటించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నాడు.

ఇంత భారీ ప్రాజెక్టుకు నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధుల నుంచి లభించిన ప్రోత్సాహం మరువలేనిదన్నాడు. ఇదో రేసీ థ్రిల్లర్ గా ఉంటుందని, చూస్తున్న వారికి రిలీఫ్ ఇచ్చేలా రకుల్ పాత్ర సాగుతుందని, తెలుగు, తమిళ భాషలు తెలియకపోయినా, రకుల్ ఎంతో కష్టపడి నటించిందని కితాబిచ్చాడు. తాను గతంలోనూ సంతోష్ శివన్ తో కలసి పని చేయాలని చూశానని, అప్పట్లో తెలుగు దర్శకులకు, తనకు సింక్ అవదని చెప్పిన ఆయన, ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకుడని వినగానే స్వయంగా వచ్చి చిత్రం చేస్తానని చెప్పారని పేర్కొన్నాడు. ఇందులో విజువల్స్ సరికొత్త అనుభూతిని ఇస్తాయని అన్నాడు. తమిళంలో తాను ఏ హీరోనూ పోటీగా భావించడం లేదని, ఇకపైనా కథలో నమ్మకం ఉంటే రెండు భాషల్లోనూ నటిస్తానని అన్నాడు.
mahesh babu
spyder
murugadas

More Telugu News