ఆ రాతలు ఎంతో బాధ కలిగిస్తున్నాయి!: ఏపీ సీఎం చంద్రబాబు
- తెలంగాణ నీటిని దొంగిలిస్తున్నామని కొన్ని పత్రికలు రాస్తున్నాయి
- పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోంటే జగన్ ఓర్వలేకపోతున్నారు
- ప్రతిపక్ష నేతలు రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్నారు
- తప్పుడు ప్రచారాలు చేయొద్దు
నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రానికి వచ్చే నీళ్లను ఆ రాష్ట్రం వాడుకుంటుందని చంద్రబాబు చెప్పారు. ప్రతిపక్ష నేతలు రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్నారని, వారు మనుషులేనా అనిపిస్తోందని అన్నారు. వారు అన్ని ప్రాజెక్టులకు అడ్డుతగిలారని, ఇలా తప్పుడు ప్రచారాలు చేయకూడదని వ్యాఖ్యానించారు. కఠిన నిర్ణయాలతో తాము అవినీతిని కూడా అరికడుతున్నామని చెప్పారు.