అది పుకారు మాత్రమే .. అందులో నిజం లేదు : ఎన్టీఆర్
- బాబీని పక్కన పెట్టేశారనే వార్తలపై స్పందించిన ఎన్టీఆర్
- కథకి సంబంధించి కొన్ని సలహాలు మాత్రమే ఇచ్చాను
- దర్శకత్వంలో జోక్యం చేసుకోలేదు
- హిట్ అయితే ఆ క్రెడిట్ బాబీ ఖాతాలోకే
ఇదే విషయాన్ని ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావిస్తే ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఈ సినిమాకి తాను దర్శకత్వం చేస్తే తన పేరునే వేసుకునేవాడిననీ .. అలా చేస్తే తనని ఎవరు అడుగుతారంటూ ప్రశ్నించారు. కథ విషయంలో .. ఇది ఇలా వుంటే బాగుంటుంది కదా అంటూ కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది గానీ, దర్శకత్వం జోలికి తాను వెళ్లలేదని ఎన్టీఆర్ చెప్పారు. అంతా బాబీనే చూసుకున్నాడనీ .. సినిమా హిట్ అయితే దర్శకుడిగా ఆ క్రెడిట్ దక్కేది ఆయనకేనని స్పష్టం చేశారు.