'బిగ్ బాస్' హౌస్ కి రావడానికి ఆసక్తి చూపని మహేశ్ బాబు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బిగ్ బాస్' హౌస్ కి రావడానికి ఆసక్తి చూపని మహేశ్ బాబు?

'బిగ్ బాస్' కార్యక్రమాన్ని తనదైన స్టైల్లో నడిపించడంలో ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు. మరో 10 రోజుల్లో తొలి సీజన్ ముగియనుంది. దాంతో బుల్లితెర ప్రేక్షకులందరిలోను ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమం ఆయా సినిమాల ప్రమోషన్స్ కి కూడా వేదికగా మారిన సంగతి తెలిసిందే.

తమ సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా రానా .. విజయ్ దేవరకొండ .. తాప్సీ .. అల్లరి నరేశ్ తదితరులు 'బిగ్ బాస్' హౌస్ లో అడుగుపెట్టారు. అక్కడి కంటెస్టెంట్స్ తో కలిసి సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన 'స్పైడర్' సినిమా విడుదలవుతోంది. అందువలన 'బిగ్ బాస్' హౌస్ కి రావలసిందిగా ఈ షో నిర్వాహకులు మహేశ్ బాబును ఆహ్వానించారట. అయితే ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ప్రమోషన్స్ చేస్తూ వెళ్లాలని భావిస్తోన్న మహేశ్, బిగ్ బాస్ హౌస్ కి రావడానికి అంతగా ఆసక్తి చూపలేదనే టాక్ వినిపిస్తోంది.   
mahesh babu

More Telugu News