మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు రెడీ అవుతోన్న ఎన్టీఆర్!

08-09-2017 Fri 16:56 | Entertainment
ఎన్టీఆర్ తాజా చిత్రంగా 'జై లవకుశ' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క, ఎన్టీఆర్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తో వుంటుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో త్రివిక్రమ్ చేస్తోన్న సినిమా పూర్తి కాగానే, ఎన్టీఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.

 ఈ సినిమాలో ఎన్టీఆర్ మార్షల్ ఆర్ట్స్ తో శత్రువులపై విరుచుకుపడవలసి వుంటుందట. థాయ్ ల్యాండ్ .. ఇండోనేషియా స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ను తెరపై చూపించనున్నట్టు సమాచారం. ఈ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడానికి ఎన్టీఆర్ ఆగ్నేయ ఆసియా వెళ్లనున్నట్టు సమాచారం. తొలిసారిగా తన దర్శకత్వంలో చేస్తోన్న ఎన్టీఆర్ ను త్రివిక్రమ్ కొత్తగా చూపించనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ పేరు .. సంగీత దర్శకుడిగా అనిరుధ్ పేరు వినిపిస్తోంది.      
ntr

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more