'సాహో' కోసం రంగంలోకి మరో బాలీవుడ్ నటి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' కోసం రంగంలోకి మరో బాలీవుడ్ నటి!

ప్రభాస్ .. సుజీత్ కాంబినేషన్లో 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో వుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కిస్తున్నారు. మలయాళ .. కన్నడ భాషల్లోను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. జాతీయస్థాయి చిత్రం కనుక, బాలీవుడ్ నుంచి ఎక్కువమంది నటీనటులను తీసుకుంటున్నారు.

కథానాయికగా శ్రద్ధా కపూర్ ను తీసుకున్న ఈ సినిమా టీమ్, కీలక పాత్రల కోసం జాకీ ష్రాఫ్ .. నీల్ నితిన్ ముఖేష్ .. చుంకీ పాండే .. టిన్నూ ఆనంద్ లను తీసుకున్నారు. నెగెటివ్ రోల్ కోసం మందిరా బేడీని ఎంపిక చేశారనేది తాజా సమాచారం. అయితే ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ ధ్రువీకరించవలసి వుంది. యూవీ క్రియేషన్స్ వారు 150 కోట్లతో నిర్మిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.     
prabhas
shraddha kapoor

More Telugu News