chiru: 'సైరా నరసింహారెడ్డి' విషయంలో అప్సెట్ అయిన తమన్!

షార్ట్స్‌లో చూడండి
చారిత్రక నేపథ్యంతో చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కనున్న సినిమాకి 'సైరా నరసింహా రెడ్డి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ కి సంగీత దర్శకుడు తమన్ రీ రికార్డింగ్ ను అందించాడు. మొదట్లో ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ ను తీసుకోవాలని దర్శకుడు సురేందర్ రెడ్డి భావించాడు. అలాగే తమన్ ని ఫిక్స్ చేసుకున్నాడు.

అయితే, సినిమా భారీతనం కారణంగా చరణ్ వాళ్లు రెహ్మాన్ కి ప్రాధాన్యతనిచ్చారు. తమన్ కి తెలియకుండానే రెహ్మాన్ తో సంప్రదింపులు జరిపారట. ఈ నేపథ్యంలో మోషన్ పోస్టర్ కి తమన్ చేతే రీ రికార్డింగ్ చేయించారు. మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఆ పని పూర్తి చేసిన తమన్, సినిమాకి సంగీతాన్ని అందించే ఛాన్స్ కూడా తనకే దక్కుతుందని భావించాడు. కానీ ఈ సినిమా టీమ్ రిలీజ్ చేసిన లిస్ట్ లో రెహ్మాన్ పేరు ఉండటంతో, తమన్ డీలాపడ్డాడని చెప్పుకుంటున్నారు.  
Go Back to Shorts
chiru
nayan

More Telugu News