5 కోట్ల భారీ సెట్లో భారీ ఫైట్ చేయడానికి ప్రభాస్ దిగిపోయాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

5 కోట్ల భారీ సెట్లో భారీ ఫైట్ చేయడానికి ప్రభాస్ దిగిపోయాడు!

ప్రభాస్ తదుపరి చిత్రంగా 150 కోట్ల బడ్జెట్ తో 'సాహో' షూటింగ్ కొన్ని రోజుల క్రిందటే మొదలైంది. ప్రభాస్ పాత్ర ప్రమేయం లేని సన్నివేశాల చిత్రీకరణతో మొదటి షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేశారు. రెండవ షెడ్యూల్ షూటింగ్ ఈ రోజున మొదలైంది. హైదరాబాద్ సారథీ స్టూడియోలో 5 కోట్ల బడ్జెట్ తో వేసిన భారీ సెట్లో ఈ షెడ్యూల్ ను ఆరంభించారు.

 ఈ రోజు నుంచే ఈ సినిమా షూటింగులో ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఆయన కాంబినేషన్లోని కొన్ని యాక్షన్ సీన్స్ ను ఇక్కడ చిత్రీకరించనున్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వచ్చేనెలలో 'దుబాయ్' లో జరగనున్న షెడ్యూల్ లో ఆమె జాయిన్ అవుతుంది. సముద్ర గర్భంలో ప్రభాస్ చేసే సాహస విన్యాసాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయనేది ఈ సినిమా యూనిట్ చెబుతోన్న మాట.     
prabhas
shraddha

More Telugu News