గ్రాండ్ ఈవెంట్ తో మహేశ్ కోలీవుడ్ ఎంట్రీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గ్రాండ్ ఈవెంట్ తో మహేశ్ కోలీవుడ్ ఎంట్రీ!

తెలుగు .. తమిళ భాషల్లో మహేశ్ బాబు 'స్పైడర్' సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. మహేశ్ బాబు తమిళంలో నేరుగా చేసిన మొదటి సినిమా ఇదే. అందువల్లనే అక్కడ ఆయన ఎంట్రీ ఘనంగా ఉండాలనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్లు వున్నారు. వాళ్లంతా కూడా ఈ సినిమా లాంచింగ్ వేడుకను చెన్నైలో వైభవంగా జరపడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.

 వచ్చే నెల 9వ తేదీన లాంచింగ్ ఈవెంట్ ను జరపనున్నట్టు చెబుతున్నారు. ఆల్రెడీ తమిళనాట కూడా మహేశ్ బాబుకి మంచి ఫాలోయింగ్ వుంది. ఇక ఈ సినిమాకి తమిళ నటీనటులు ... సాంకేతిక నిపుణులు పనిచేయడం మరింతగా కలిసొచ్చే అంశం. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, వచ్చేనెల 27వ తేదీన విడుదల చేయనున్నారు.   
mahesh babu
rakul

More Telugu News