మొత్తానికి ప్రభాస్ జోడీగా శ్రద్ధా కపూర్ ఖాయమైంది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మొత్తానికి ప్రభాస్ జోడీగా శ్రద్ధా కపూర్ ఖాయమైంది!

'సాహో' సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ షూటింగుకి రంగం సిద్ధమైంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ తో పాటు కథానాయిక కూడా పాల్గొనవలసి వుంది. తెలుగు .. తమిళ ..  హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అందువలన బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నారు.

ఈ క్రమంలో శ్రద్ధా కపూర్ పేరు ఎక్కువగా వినిపించింది. ఆమెనే ఖరారు చేశారనేది తాజా సమాచారం. హిందీలో 'ఆషీకీ 2'తో అందరి మనసులు కొల్లగొట్టేసిన శ్రద్ధా కపూర్, ప్రభాస్ మూవీతో టాలీవుడ్ కి పరిచయమవుతుండటం విశేషం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాకి, శంకర్ - ఎహసాన్ - లాయ్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.   
prabhas
shraddha kapoor

More Telugu News