చైతూ తాజా సినిమా 'సవ్యసాచి' టైటిల్ లోగో రిలీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైతూ తాజా సినిమా 'సవ్యసాచి' టైటిల్ లోగో రిలీజ్

దర్శకుడు చందూ మొండేటి .. నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన 'ప్రేమమ్' ఘన విజయాన్ని సాధించింది. అప్పటి నుంచే వీళ్లు తమ కాంబినేషన్లో మరో సినిమా చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు ఇప్పుడు సమయం కుదిరింది. చందూ మొండేటి వినిపించిన లైన్ నచ్చడంతో ఆయనతో సెట్స్ పైకి వెళ్లడానికి చైతూ రెడీ అవుతున్నాడు.

తాజాగా ఈ సినిమాకి 'సవ్యసాచి' అనే టైటిల్ ను ఫిక్స్ చేసి .. కొంతసేపటి క్రితం టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. రెండు బలమైన చేతులు పదునైన ఆయుధాలను ధరించివున్న పోస్టర్ ఆకట్టుకునేలా వుంది. పాండవ మధ్యముడిగా చెప్పుకునే అర్జునుడు విలు విద్యలో నిష్ణాతుడు. చీకట్లో సైతం గురితప్పక బాణాన్ని సంధించే ఆయనకి 'సవ్యసాచి' అనే బిరుదు వుంది. అదే ఇప్పుడు చైతూ సినిమాకి టైటిల్ కావడం ఆసక్తిని రేకెత్తించే అంశం.  
nagachaitanya

More Telugu News