'లై' మూవీలో హైలైట్ గురించి నితిన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'లై' మూవీలో హైలైట్ గురించి నితిన్!

నితిన్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'లై' సినిమా .. ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ, ఈ సినిమాలో యూఎస్ లో సెటిలవ్వడానికి ప్రయత్నించే కుర్రాడిగా తాను కనిపిస్తానని చెప్పాడు. యూఎస్ వెళ్లాక ఎలాంటి చిక్కుల్లో పడతాననేది ఉత్కంఠభరితంగా ఉంటుందని అన్నాడు.

ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ పాత్ర కొత్తగా అనిపిస్తుందనీ .. ఆయనతో తాను తలపడతానని చెప్పాడు. క్లైమాక్స్ లో తమ ఇద్దరి మధ్య జరిగే ఫైట్ .. ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అన్నాడు. ఆ ఫైట్ ను కంపోజ్ చేసిన తీరు .. ఆ సీన్ కోసం టీమ్ తీసుకున్న రిస్క్ ఆడియన్స్ ను ఆశ్చర్యచకితులను చేస్తుందని చెప్పాడు. తన జోడీగా మేఘా ఆకాశ్ కరెక్ట్ గా సెట్ అయిందనీ .. యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేయడం ఖాయమని అన్నాడు.    
nithin
megha akash

More Telugu News