పెళ్లి గురించి .. పుకార్ల గురించి ప్రభాస్ క్లారిటీ ఇచ్చేశాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి గురించి .. పుకార్ల గురించి ప్రభాస్ క్లారిటీ ఇచ్చేశాడు!

అందాల కథానాయిక అనుష్కతో ప్రభాస్ పెళ్లి జరగనుందని ఆ మధ్య వార్తలు షికారు చేశాయి. అప్పట్లోనే అనుష్క స్పందిస్తూ .. అలాంటిదేం లేదని స్పష్టం చేసింది. తాజాగా అదే విషయం పై ప్రభాస్ స్పందించాడు. ఒక హీరో .. ఒక హీరోయిన్ వరుసగా రెండు .. మూడు సినిమాలు చేస్తే ఇలాంటి రూమర్లు రావడం సహజమేనని అన్నాడు.

 ఎలాంటి ఆధారాలు లేకుండా హల్ చల్ చేసే ఇలాంటి పుకార్లు మొదట్లో తనకి ఇబ్బంది కలిగించేవనీ, ఆ తరువాత వాటిని గురించి పట్టించుకోవడం మానేశానని చెప్పాడు. ఇక తన ఇంట్లో పెళ్లికి సంబంధించిన ముచ్చట్లు జోరందుకున్నాయనీ, త్వరలోనే పెళ్లి జరగవచ్చనే వార్తల్లోను నిజం లేదని అన్నాడు. ప్రస్తుతం తన దృష్టి 'సాహో' సినిమాపైనే ఉందనీ, ఆ సినిమా పూర్తయిన తరువాత పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు. 
prabhas

More Telugu News