మేఘా ఆకాశ్ స్థానంలో లావణ్య త్రిపాఠి
Add ap7am to your home Screen

మేఘా ఆకాశ్ స్థానంలో లావణ్య త్రిపాఠి

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. స్రవంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికలుగా అనుపమ పరమేశ్వరన్ ను .. మేఘా ఆకాశ్ ను తీసుకున్నారు. అయితే మేఘా ఆకాశ్ ప్లేస్ లో లావణ్య త్రిపాఠిని ఎంపిక చేశారనేది తాజా సమాచారం.

ఈ సినిమా లాంచ్ కి కూడా మేఘా ఆకాశ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె నితిన్ జోడీగా 'లై' సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఫారిన్లో జరుగుతుండటం వలన, ఆమె డేట్స్ సర్దుబాటు కాలేదట. అందువలన ఆమె ప్లేస్ లో లావణ్య త్రిపాఠిని తీసుకున్నట్టు సమాచారం. మొత్తానికి ఒక మంచి ప్రాజెక్టులో లావణ్య త్రిపాఠి ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ఫస్టు లుక్ ను ఆగస్టు 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
ram
lavanya

More Telugu News