'సాహో' కథాంశంపై ప్రభాస్ వివరణ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' కథాంశంపై ప్రభాస్ వివరణ!

ప్రభాస్ అభిమానులంతా 'సాహో' సినిమా విశేషాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ న్యూ లుక్ తో కనిపించనున్నాడనే విషయం వాళ్లలో మరింత ఆత్రుతను పెంచుతోంది. ఈ సినిమాకి భారీ స్థాయిలో గ్రాఫిక్స్ ఉండనున్నాయనేసరికి, ఇది సోషియో ఫాంటసీతో కూడిన కథాంశమని అనుకున్నారు. అందులో భాగంగానే భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని భావించారు.

అయితే ఇది సోషియో ఫాంటసీకి సంబంధించిన కథ కాదనీ .. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని తాజాగా ప్రభాస్ చెప్పాడు. ఇంగ్లిష్ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో, పలువురు బాలీవుడ్ నటీనటులు కనిపించనుండగా .. హాలీవుడ్ టెక్నీషియన్స్ దీనికి పనిచేస్తున్నారు.      
prabhas

More Telugu News