నేను ఏడుస్తుంటే ఆయనా ఏడ్చేశాడు: సాయిపల్లవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను ఏడుస్తుంటే ఆయనా ఏడ్చేశాడు: సాయిపల్లవి

వరుణ్ తేజ్ .. సాయిపల్లవి జంటగా నటించిన 'ఫిదా' చిత్రం .. వసూళ్ల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమాలో 'భానుమతి' పాత్రను పోషించిన సాయిపల్లవిని అనేక మంది అభినందిస్తున్నారు. ఈ సినిమా ఓ షూటింగులా కాకుండా ఒక కుటుంబంలోని సభ్యుల మధ్య చోటుచేసుకునే సన్నివేశాల మాదిరిగా కొనసాగిందని చెప్పింది.

ఈ సినిమాలో తన తండ్రి పాత్రలో సాయిచంద్ నటించారని అంది. ఒక సన్నివేశంలో తాను ఏడుస్తూ డైలాగ్స్ చెబుతుంటే .. ఆయన నిజంగానే కళ్ల వెంట నీళ్లు పెట్టుకున్నారని చెప్పింది. అలాగే ఆయన దుఃఖంతో నటిస్తోన్న సన్నివేశంలో ఆయనని చూస్తూ తాను నిజంగానే ఏడ్చేశానని అంది. అలా పాత్రల్లో ఒదిగిపోవడం వల్లనే ఈ సినిమా ఆడియన్స్ కి ఇంత దగ్గరగా వెళ్లగలిగిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
varin tej
sai pallavi

More Telugu News